: నోరు జారాడు.. ఫలితం అనుభవించాడు!


రాజారాం పాండే.. ఉత్తరప్రదేశ్ సర్కారులో నిన్నటివరకు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి. అయితే నోటిని అదుపులో పెట్టుకోలేని ఫలితం పదవికే ఎసరు తెచ్చుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. యూపీలోని ప్రతాప్ గఢ్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఈ మంత్రి వర్యుడు ఊరకుండలేక.. జిల్లాలోని రోడ్లను మాధురీ దీక్షిత్, హేమామాలినిల చెక్కిళ్ళను తలపించేలా నిర్మిస్తామంటూ వాగ్దానం చేశాడు. ఇంకేముంది విపక్షాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి అంటూ ఆందోళన చేపట్టాయి. దీంతో సీఎం అఖిలేశ్ యాదవ్ వెంటనే దిద్దుబాటు చర్యలకు నడుంకట్టాడు. వెంటనే గవర్నర్ తో చర్చించి రాజారాం పాండేను పదవి నుంచి తప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు. ఇదే మంత్రి గత ఫిబ్రవరిలో ఓ అధికారిణి అందాన్ని ఆమె సమక్షంలోనే పొగిడి చిక్కుల్లో పడ్డాడు. అంతేగాకుండా తన జిల్లాలో కలెక్టర్ గా ఓ లేడీ ఉండడం లక్కీ అని పేర్కొని తన వాక్చాలత్వం చాటుకున్నాడు.

  • Loading...

More Telugu News