: పోలవరం ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు: కేకే
పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనుల గురించి ఆలోచించాల్సిన అవసరముందని కేకే అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్నారు. పోలవరం విషయంలో ఇది ఎక్కడా అమలు కాలేదన్నారు. నీరు వృథాగా పోవాలని తాము కోరుకోవడం లేదని కేకే అన్నారు. కేవలం డిజైన్ మార్చాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.