: పోలవరం బిల్లుకు మద్దతిస్తున్నా: సీఎం రమేశ్
పోలవరం బిల్లుకు మద్దతిస్తున్నానని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... పోలవరం ఆర్డినెన్స్ కు రాజ్యాంగ బద్ధత ఉందని అన్నారు. పోలవరాన్ని ఎవరూ అడ్డుకోవద్దని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం సాధ్యమని ఆయన చెప్పారు. పోలవరం డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం రమేశ్ ఆరోపించారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన కోరారు.