: స్థానిక ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యం: బొత్స
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకునే క్రమంలో దౌర్జన్యకాండ సృష్టించిందని ఆయన సోమవారం విమర్శించారు. నెల్లూరు జడ్పీ ఎన్నికలో కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. మెజార్టీ లేకపోయినప్పటికీ జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. రుణ మాఫీ విషయంలో చంద్రబాబు విధానాలతో రైతులు అయోమయంలో కూరుకుపోయారని బొత్స విమర్శించారు.