: 1958లో ముంపు గ్రామాలు ఆంధ్రాలోనే ఉండేవి: రాజ్ నాథ్ సింగ్
ప్రస్తుతం ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాల్లోని గ్రామాలు 1958లో ఆంధ్రాలోనే ఉండేవని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో తెలిపారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన, ముంపు ప్రాంతాల ప్రజలకు ఏపీ సర్కారు పునరావాసం కల్పిస్తుందన్నారు.