: అక్రమ నిర్మాణాల కూల్చివేతకే జీహెచ్ఎంసీ తీర్మానం


హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ తీర్మానించింది. జంట నగరాల పరిధిలో 890 అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వీటిలో తీవ్ర ఉల్లంఘనలున్న 172 నిర్మాణాలను రేపటి నుంచి కూల్చివేసే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్ కన్వెన్షన్ వ్వవహారంలో తమకింకా కోర్టు ఉత్తర్వులు అందలేదని చెప్పిన ఆయన, దాని యాజమాన్యం స్వచ్ఛంద కూల్చివేతపై న్యాయ నిపుణులతో చర్చించనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News