: ఆ దోపిడీ ముఠా...భావి ఇంజినీర్ల సమాహారం
ఎనిమిది మంది సభ్యులున్న ఆ దొంగల ముఠాలో ఉన్నవారంతా భావి ఇంజినీర్లు. చెడు అలవాట్లకు బానిసలైన వారంతా వృద్ధులను, ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడ్డారు. ఆ క్రమంలో ఈ ముఠా వరుస హత్యలకూ పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా పనులు చక్కబెట్టేసుకుంటోంది. అయితే, దోపిడీలో చేజిక్కించుకున్న బైక్ లపై తిరుగుతూ ఇద్దరు ముఠా సభ్యులు కాకినాడ పోలీసులకు దొరికిపోయారు. విచారణలో వాస్తవాలను వెల్లడించడంతో పాటు మిగిలిన ముఠా సభ్యులను పట్టించేశారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు వీరి నుంచి 13 బైక్ లు, 28 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిన ఇంజినీరింగ్ విద్యార్థులంతా విశాఖ, కాకినాడ అర్బన్, రూరల్, పెద్దాపురం తదితర ప్రాంతాలకు చెందినవారే.