: మధ్యాహ్నం 2.17 నిమిషాలకు రాజ్యసభలో పోలవరం బిల్లు
ఈ మధ్యాహ్నం 2.17 నిమిషాలకు రాజ్యసభలో పోలవరం బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేందుకు సభ ఆమోదం తీసుకోనుంది. ఈ సందర్భంగా బిల్లుపై చర్చ జరగనుంది. ఇప్పటికే ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.