: సీఎం కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యే తలసాని ఆహ్వానం
ఫలహార పండుగకు రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఈ మేరకు ఈ రోజు కేసీఆర్ నివాసానికి వెళ్లిన తలసాని కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. మరోవైపు తలసాని టీఆర్ఎస్ లోకి వెళతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.