: గిరిజనులపై వీహెచ్ వీరంగం
పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో మీరేం చేస్తారో చెప్పాలంటూ నిలదీసిన గిరిజనులపై రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గిరిజనులు ధర్నా చేపట్టారు. వీరికి మద్దతు తెలిపేందుకు వచ్చిన వీహెచ్ ను వారు అడ్డుకున్నారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన పోలవరంపై తానేమి చేస్తానో, మీరే చూస్తారంటూ ఒంటికాలిపై లేచారు. పోలవరంపై రాజ్యసభలో మీరు అభ్యంతరాలు లేవనెత్తుతారా? అన్న గిరిజనుల ప్రశ్నలకు వీహెచ్ పై విధంగా స్పందించారు. పోలవరం డిజైన్ మార్చి నిర్మిస్తే తమకేమీ అభ్యంతరం లేదని ఈ సందర్భంగా గిరిజనులు అభిప్రాయపడ్డారు.