: అసోంలో కొనసాగుతున్న కర్ఫ్యూ...
అసోంలోని బక్సా జిల్లాలో అపహరణకు గురైన నలుగురు వ్యక్తుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల క్రితం విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమ్మకాయల వ్యాపారం నిమిత్తం పొరుగు ప్రాంతాలకు వెళ్లిన నలుగురు వ్యక్తులను బోడో తీవ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. ఈ విషయంపై స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో పాటు లాఠీచార్జీ కూడా చేయాల్సి వచ్చింది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో మోహరించారు.