: కుమార్తె కోసం పుస్తకం రాయబోతున్న షారుక్ ఖాన్


ముద్దుల కుమార్తె సుహానా కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఓ పుస్తకం రాయబోతున్నాడు. ఇటీవల 'ద అనుపమ్ ఖేర్ షో - కుచ్ భీ హో సక్తా హే'లో షారుక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన కూతురు తనలాగే నటి అవ్వాలనుకుంటోందని, అందుకు ఆమెను పూర్తిగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో నటనలో కొన్ని టిప్స్ చెప్పేందుకు సుహానా కోసం ఓ పుస్తకం రాయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పుస్తకం టైటిల్ 'టు సుహానా, ఆన్ యాక్టింగ్, ఫ్రమ్ పాపా' అని చెప్పాడు. తన స్టయిల్లో నటన గురించి చిన్న చిన్న పేరాలతో ఈ పుస్తకం ఉంటుందని షారుక్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News