: చరిత్రలో నిలిచిపోనున్న హషీమ్ ఆమ్లా


స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతరుడిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు. బుధవారం శ్రీలంకతో సఫారీలు తొలి టెస్టు ఆడనున్నారు. టెస్టు కెప్టెన్ గా గ్రేమ్ స్మిత్ వైదొలగడంతో పగ్గాలు ఆమ్లాకు అప్పగించారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు శ్వేతజాతీయులే రెగ్యులర్ కెప్టెన్లుగా కొనసాగారు. పాక్ సంతతికి చెందిన ఆమ్లా ఇకపై ప్రొటీస్ కు పూర్తిస్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇంతకుముందు నల్లజాతీయుడు ఆష్వెల్ ప్రిన్స్ నాయకత్వం వహించినా, అది తాత్కాలిక కెప్టెన్ గానే. తాజాగా లంకతో వన్డే సిరీస్ లో రెండు సెంచరీలు బాది మాంచి ఊపుమీదున్న ఆమ్లా మీడియాతో మాట్లాడుతూ... టెస్టు జట్టులో కొత్త రక్తం ప్రవహిస్తోందని, విన్నింగ్ కాంబినేషన్లను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News