: కాంబోడియాలో హెలికాఫ్టర్ కూలి ఐదుగురి మృతి
కాంబోడియాలో సోమవారం సైనిక హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయిన ఘటనలో ఐదుగురు మరణించగా, మరొకరు గాయపడ్డారు. కాంబోడియా రాజధాని నామ్ ఫెన్ శివారులోని డాంగ్ కోర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆ దేశ సైనికాధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో కాంబోడియా వైమానిక దళానికి చెందిన ఐదుగురు ట్రైనీలున్నారు. ప్రమాద కారణాలేమీ ఇంకా తెలియరాలేదు.