: అశ్విన్ ను తీసుకోనందుకు చింతించడంలేదు: ధోనీ
ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ను ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా తుదిజట్టులోకి తీసుకోనందుకు తామేమీ చింతించడంలేదని టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. నిస్సారమైన పిచ్ పై విభిన్నంగా ఏమీ చేయలేకపోయామని అభిప్రాయపడ్డాడు. పిచ్ సహకరించకున్నా, బౌలర్లు రాణించడం హర్షణీయమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తో తొలి టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. అశ్విన్ ను కాదని జడేజాకు చోటు కల్పించడంపై స్పందిస్తూ, ట్రాక్ స్పిన్నర్లకు అనుకూలించని నేపథ్యంలో అశ్విన్ ను తీసుకోకపోవడం పట్ల బాధపడడంలేదని చెప్పుకొచ్చాడు.