: గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో కేంద్రానికి నోటీసులు
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీకైన ఘటనలో కేంద్ర ప్రభుత్వానికి, పెట్రోలియం శాఖకు, గెయిల్ కంపెనీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాస్ పైప్ లైన్ ను నగరం గ్రామానికి దూరంగా వేయాలన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.