: దాణా కేసులో నేడు కోర్టుకు లాలూ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేడు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. పశువుల దాణా కుంభకోణంలో ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ న్యాయమూర్తి ఏకే రాయ్ నేడు నమోదు చేయనున్నారు. ఈ కేసుతో పాటు మరో రెండు కేసుల్లోనూ సోమవారం లాలూ, తన వాంగ్మూలాన్ని కోర్టుకు ఇవ్వాల్సి ఉంది. దాణా కేసులో ఇదివరకే దోషిగా తేలిన తనను మళ్లీ ప్రశ్నించడం తగదన్న లాలూ పిటీషన్ ను సీబీఐ కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన నేడు కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.