: లిఫ్ట్ బటన్ల కన్నా టాయిలెట్లే ఆరోగ్యకరం
ఆసుపత్రుల్లో ఉండే లిఫ్ట్ బటన్లలో టాయిలెట్ ఉపరితలం కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని తేలింది. కెనడాలో జరిపిన పరిశోధనల్లో ఇది రుజువయింది. అధ్యయన బృందానికి టొరొంటో యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డొనాల్డ్ రెడెల్మీయర్ నాయకత్వం వహించారు. పరిశోధనలో భాగంగా ఎంచుకున్న మూడు ఆసుపత్రుల్లోని లిఫ్ట్ బటన్లను పదిరోజుల పాటు వస్త్రంతో తుడిచారు. అలాగే పురుషుల మరుగుదొడ్ల ఉపరితలాన్ని, టాయిలెట్ ఫ్లష్ ను కూడా వస్త్రంతో తుడిచి... రెండింటినీ పరీక్షించారు. లిఫ్ట్ బటన్లలో 61 శాతం బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటే... టాయిలెట్ ఉపరితలంపై ఇది 43 శాతం మాత్రమే ఉందని పరిశోధనలో తేలినట్టు డాక్టర్ డొనాల్డ్ తెలిపారు.