: సోనియాతో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశం
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభలో ప్రవేశపెట్టే ట్రాయ్ బిల్లుపై సభలో అనుసరించే వ్యూహంపై చర్చిస్తున్నారు. అటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజ్యసభ కాంగ్రెస్ సభ్యులతో వేర్వేరుగా పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ భేటీ అయ్యారు. రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు.