: బ్రెజిల్ లో అర్జెంటీనా అభిమానుల వీరంగం


ప్రపంచ కప్ ఫుట్ బాల్ సంరంభం ముగిసింది. విశ్వవిజేత కిరీటాన్ని జర్మనీ ఎగురవేసుకుపోయింది. చివరి దాకా వచ్చిన తమ జట్టు ట్రోఫీ గెలవడంలో చతికిలబడటం అర్జెంటీనా అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. కొంత మంది అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విచక్షణారహితంగా దాడులకు దిగిన అర్జెంటీనా అభిమానులు బ్రెజిల్ లో ధ్వంస రచనకు దిగారు. బ్రెజిల్ లోని దుకాణాలపై విరుచుకుపడ్డారు. జర్మనీ అభిమానులతో పాటు పోలీసులపైనా దాడులకు దిగారు. ఈ దాడుల్లో 15 మంది దాకా పోలీసులు గాయపడ్డారు. అర్జెంటీనా అభిమానులను నిలువరించేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ లను వినియోగించాల్సి వచ్చింది. అనంతరం దాడులకు పాల్పడ్డట్టుగా భావిస్తున్న 40 మంది అర్జెంటీనా అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News