: నివేదిక అందాక వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి యాజమాన్యంపై చర్యలు: హోంమంత్రి


బియాస్ నదిలో మృతి చెందిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఈ రోజు కలిశారు. కళాశాల యాజమాన్యం తమ బిడ్డల విషయంలో నిర్లక్ష్యం వహించిందంటూ ఈ సందర్భంగా వారు మంత్రికి మొరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన నాయిని, ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టామని... నివేదిక తమకు అందాక సీఎం కేసీఆర్ తో చర్చించి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, నదిలో గల్లంతై ఇంకా ఆచూకీ దొరకని ముగ్గురు విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News