: ఇక టీవీ ద్వారా చదువుకోవచ్చు!


సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీ కార్యక్రమాలను వీక్షించడమే కాదు.. ఇకపై ఇంట్లోనే కూర్చుని మీరు లాయర్ అవొచ్చు, డాక్టరేట్ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం అనువైన లెర్నింగ్ సాఫ్ట్ వేర్ ను సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సిడాక్) అభివృద్ధి చేసింది. ఇందుకు పుణె యూనివర్సిటీలోని మీడియా రీసెర్స్ సెంటర్ సహకారం తీసుకుంది. దీని ద్వారా 80 రకాల కోర్సులకు ఇంట్లో టీవీ ముందే కూర్చుని పాఠాలు వినవచ్చు. వీటిలో హెల్త్ కేర్, కామర్స్, గవర్నెన్స్, ఎంటర్ టైన్ మెంట్ మొదలైనవి ఉన్నాయి. వినడమే కాదు క్విజ్, ఇతర కార్యక్రమాలలోనూ పాల్గొనవచ్చు. అంటే దూరవిద్య ఇక నట్టింట్లోకి వచ్చేసింది అన్నమాట.

  • Loading...

More Telugu News