: అమెరికా, చిలీల్లో స్వల్ప భూకంపాలు
అగ్రరాజ్యం అమెరికాతో పాటు చిలీలోనూ ఆదివారం స్వల్పంగా భూమి కంపించింది. 14 గంటల వ్యవధిలో ఓక్లహామా మధ్య ప్రాంతంలో విడతల వారీగా ఏడు స్వల్ప భూకంపాలు సంభవించినట్లు అమెరికా భూగర్భ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 7.57 నుంచి ఆదివారం ఉదయం 9.51 గంటల మధ్య చోటుచేసుకున్న ఈ భూకంపాల తీవ్రత కేవలం 2.6 నుంచి 2.9 మధ్యన నమోదైందని తెలిపింది. స్వల్ప భూకంపాలైన నేఫథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం కాని ఆస్తి నష్టం కాని నమోదు కాలేదు. ఇదిలా ఉంటే, ఆదివారం తెల్లవారుజామున 4.54 గంటల సమయంలో చిలీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1 గా నమోదైందని అమెరికా భూగర్భ శాఖ తెలిపింది. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టంపై వివరాలు వెల్లడి కాలేదు.