: షేక్ చేసిన షకీరా
లాలా... లాలాల... లాలా అంటూ షకీరా చేసిన విన్యాసాలు రియోడిజనీరోలోని మారకానా స్టేడియంలో కనువిందు చేశాయి. షకీరా సొంపులకు, నడుం వొంపులకు, ఊపులకు ప్రేక్షకులు చిత్తైపోయారు. గ్యాలరీలో ఉన్న సాకర్ అభిమానులందరూ షకీరా పాటకు కాలు కదిపారు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముగింపు సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఆడి పాడింది. చివర్లో తన కొడుకు మిలన్ ను కూడా వేదికపైకి తీసుకు వచ్చింది. షకీరా డ్యాన్స్ తో పాటు, సాంబా నృత్యాలు, గిటారిస్ట్ శాంతానా, కార్లోనిన్, బ్రెజిల్ సింగర్ సాంగోలా డ్యాన్సులు అభిమానులను అలరించాయి. 2010 సాకర్ ప్రపంచకప్ సమయంలో కూడా 'వాకా వాకా' అంటూ అభిమానులను షకీరా సమ్మోహితుల్ని చేసింది.