: ఆనం వర్సెస్ దానం


అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్ ను ఉరి తీసినా ఫరవాలేదంటూ ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సహచర మంత్రులు కొందరు బలపరుస్తుంటే.. మరో మంత్రి దానం నాగేందర్ మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. ఆనం ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని దానం ప్రశ్నించారు. ఆనం వంటి నేతలు సందర్భం లేకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. అంతేగాకుండా, వైఎస్సార్ ఇప్పటికీ తమ ప్రియతమ నేత అంటూ అగ్నికి ఆజ్యం పోసేందుకు యత్నించారు.

ఇక సీబీఐ ఐదో ఛార్జిషీటు దాఖలు చేయడంపై స్పందిస్తూ, ఈ వ్యవహారంతో చివరికి ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లుతోందని దానం పేర్కొన్నారు. అయితే, క్యాబినెట్ నిర్ణయాలకు ఏ ఒక్క మంత్రినో బలిచేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాల్సిన పనేమీ లేదని దానం చెప్పారు.

  • Loading...

More Telugu News