: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న అల్లం
తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ తొలి ఛైర్మన్ గా అల్లం నారాయణ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లి చాపెల్ రోడ్డులో ఉన్న ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బాధ్యతలు చేపడతారు. అంతకు ముందు గన్ పార్కులోని అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి ప్రెస్ అకాడమీకి చేరుకుంటారు. ఈ ర్యాలీలో పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు, తెలంగాణవాదులు పాల్గొంటారు. 'నమస్తే తెలంగాణ' దినపత్రికకు ఎడిటర్ గా గత మూడేళ్లుగా ఆయన సేవలందించారు.