: తెలంగాణ ఇంక్రిమెంటుకు తాత్కాలిక బ్రేక్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో, టీ ఉద్యోగులకు కానుకగా తెలంగాణ ఇంక్రిమెంటును ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, తెలంగాణ ఉద్యోగులంతా ఇంక్రిమెంటు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తెలంగాణ సర్కార్ ఈ ఇంక్రిమెంటుకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఉద్యోగుల పంపిణీ పూర్తయిన తర్వాతే టీ ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు ఇంక్రిమెంటు ఇస్తే... తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే, ఈ అంశానికి టీ సర్కార్ తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇప్పటికే తెలంగాణ ఇంక్రిమెంటుకు సంబంధించి ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేశారు. ఇంక్రిమెంటు కోసం దాదాపు రూ. 200 కోట్లు అవసరమవుతాయని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News