: మెస్సీకి గోల్డెన్ బాల్


ఫిపా వరల్డ్ కప్ లో అత్యంత మెరుగైన ఆటను ప్రదర్శించిన ఆటగాడికిచ్చే గోల్డెన్ బూట్ అవార్డును అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లయొనెల్ మెస్సీ సొంతం చేసుకున్నాడు. టోర్నీ ఆసాంతం తన అద్భుత ఆటతీరుతో అభిమానులను మెస్సీ అలరించాడు. అలాగే, కొలంబియా స్ట్రైకర్ జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్డెన్ బూట్ ను సొంతం చేసుకున్నాడు. టోర్నీలో మొత్తం ఆరు గోల్స్ నమోదు చేసిన రోడ్రిగ్వెజ్ ను గోల్డెన్ బూట్ వరించింది. గోల్డెన్ గ్లోవ్ అవార్డును జర్మనీ గోల్ కీపర్ న్యూర్ అందుకున్నాడు. గోల్ పోస్ట్ వద్ద ప్రత్యర్థుల దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నందుకు న్యూర్ ను ఈ అవార్డు వరించింది.

  • Loading...

More Telugu News