: త్వరలో ట్విట్టర్ 'సంగీత సేవ'!


విఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ 'ట్విట్టర్' తన ఖాతాదారుల కోసం 'మ్యూజిక్ సర్వీస్' ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది! ఈ క్రమంలో సుప్రసిద్ధ మ్యూజిక్ సైట్ 'వుయ్ ఆర్ హంటింగ్' ను ట్విట్టర్ ఇటీవలే కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని 'వుయ్ ఆర్..' కూడా ధ్రువీకరించింది. అంతేగాకుండా నెట్టింట్లో తమ జోడీ దూసుకెళ్ళడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోందీ 'సంగీత ప్రపంచం'. అయితే, ట్విట్టర్లో ఈ సేవలు అందుకోవాలంటే ఖాతాదారులు ఓ ప్రత్యేకమైన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోక తప్పదు. ఈ స్పెషల్ యాప్ ను ట్విట్టరే రూపొందించిందట. వచ్చే శుక్రవారం నుంచి ఈ మ్యూజిక్ యాప్ అందుబాటులోకి రానుందని ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ అంటోంది.

  • Loading...

More Telugu News