: తిరుమలలో చాతుర్మాస దీక్ష ప్రారంభం


తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జియ్యంగార్ ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఆలయం ముందున్న పెద్ద జియ్యంగార్ మఠంలో శాస్త్రోక్త కార్యక్రమాలు జరిగాయి. ముందుగా పెద్ద జియ్యంగార్ మఠం నుంచి జియ్యంగార్లు, వారి శిష్యులు వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. అనంతరం శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో భాస్కర్, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తిరుమల పెద్దజియ్యంగార్ కి మేల్ చాత్ వస్త్రాన్ని, చిన్నజియ్యంగార్ కి నూలు చాత్ వస్త్రాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా పెద్ద జియ్యంగార్ మాట్లాడుతూ... ఈ చాతుర్మాస దీక్షలకు హైందవ వైదిక ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. రామానుజాచార్యుల వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాసపూర్ణిమ మరుసటి రోజు నుంచి ఈ దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News