: బోనాలు సమర్పించేందుకు పోటెత్తిన భక్తులు
సికింద్రాబాదులోని మహంకాళీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ జాతర (బోనాల పండుగ) ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు కిలోమీటరుకు పైగా భక్తులు బారులు తీరారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది. రేపు ఉదయం రంగం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో దేశ భవిష్య వాణిని వినిపించడం ఆనవాయతీగా వస్తోంది.