: పోలవరంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం: శ్రీనివాస గౌడ్
పోలవరంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ అన్నారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో పోలవరం బిల్లును తెలంగాణ ఎంపీలు అడ్డుకోవాలని శ్రీనివాసగౌడ్ కోరారు. ఢిల్లీలో రేపు తెలంగాణ ఎంపీలు సమావేశమవుతున్నారు. పోలవరం ఆర్డినెన్స్ ను అడ్డుకోవడంపై ఈ భేటీలో చర్చించనున్నారు.