: భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ డ్రా అవుతుందా?
ట్రెండ్ బ్రిడ్జ్ లో భారత్ - ఇంగ్లండ్ ల మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ డ్రా దిశగా పయనిస్తోంది. 3 వికెట్లు కోల్పోయి 167 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఐదో రోజు రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్... మరో మూడు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి 230 పరుగులతో భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. రవీంద్ర జడేజా (18), స్టువర్ట్ బిన్సీ (26) క్రీజులో కొనసాగుతున్నారు. అంతకు ముందు మురళీ విజయ్ (52), పూజారా (55), ధావన్ (29), రెహానే (24) పరుగులు చేశారు. ధోనీ (11), విరాట్ కోహ్లి (8) పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచారు. నాల్గో రోజు 9 వికెట్ల నష్టానికి 352 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్సింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ చివరి వికెట్టుకు అత్యధిక పరుగుల రికార్డు నమోదు చేసి భారత్ బౌలర్లకు షాక్ ఇచ్చింది. 298 పరుగుల వద్ద 9 వికెట్టును కోల్పోయిన తరుణంలో ఇంగ్లండు మిడిల్ ఆర్డర్ ఆటగాడు రూట్ చెలరేగిపోయాడు. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 498 పరుగులు సాధించింది.