: అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం నోటీసు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. పెయిడ్ న్యూస్ అంశంలో ఆయనకు నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల ఖర్చులకు సంబంధించి లెక్కలు ఇవ్వనందుకు సభ్యత్వాన్ని ఎందుకు తొలగించకూడదో 20 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఈ నోటీసును జారీ చేసింది.