: శాకంబరీ ఉత్సవాల్లో కనకదుర్గమ్మను లక్ష మంది దర్శించుకున్నారు: ఈవో త్రినాథరావు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని లక్షమంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. శాకంబరీ ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణకు 18 టన్నుల కూరగాయలు, 4 టన్నుల ఫలాలను ఉపయోగించామని ఆయన చెప్పారు.