: తిరుమల క్యూ లైన్లో పాము కలకలం
తిరుమల క్యూ లైన్ లోకి పాము ప్రవేశించడంతో కలకలం రేగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఈ ఘటనతో భయాందోళనలకు లోనయ్యారు. క్యూ లైన్లలో ఉన్న ఇద్దరు భక్తులను పాము కాటు వేసింది. బళ్లారికి చెందిన గౌరమ్మ(55), ఐదేళ్ల చిన్నారి భవానిని పాము కాటు వేయడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొలుత తిరుమలలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.