: రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆమె తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి అన్న విషయం విదితమే. టీఆర్ఎస్ కు టీడీపీ సభ్యులు మద్దతు పలకడంతో ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ ను వరించింది. టీఆర్ఎస్ కు 21 మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతు లభించింది. దీంతో జెడ్పీ ఛైర్ పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.