: ఉత్కంఠ రేపుతున్న రంగారెడ్డి జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక


రంగారెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. జెడ్పీ ఎన్నికకు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్, టీడీపీ కార్పొరేటర్లు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. ముందు రారని అనుకున్న కాంగ్రెస్ జెడ్పీటీసీలు కూడా హాజరయ్యారు. ఇక్కడ తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు టీడీపీ సభ్యులు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ముగిసింది. కో-ఆప్షన్ సభ్యులుగా ఖాజా మొయినుద్దీన్, మీర్ మహ్మద్ అలీ ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News