: కోదండరాంపై మోత్కుపల్లి సీరియస్.. ఎందుకంటే..
తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాంపై తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూమాల వేయడంపై మోత్కుపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితవర్గానికి చెందిన మంత్రి జె. గీతారెడ్డికి కర్రుకాల్చి వాతలు పెట్టాలంటూ వ్యాఖ్యానించిన కోదండరాంకు.. అంబేద్కర్ కు నివాళి అర్పించే అర్హత లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంకు దళితులే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 'లక్ష రూపాయల జీతం తీసుకుంటూ, ఏనాడైనా విద్యార్థులకు పాఠం చెప్పావా?' అంటూ కోదండరాంను ప్రశ్నించారు. తెలంగాణ వాదాన్ని అడ్డంపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.