: రెండు రోజుల్లోపల కేసీఆర్ స్పందించాలి: మంత్రి గంటా
ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై టీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల్లో స్పందించాలని... లేకపోతే కేంద్రాన్ని కాని, లేదా కోర్టును కాని ఆశ్రయిస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. స్థానికతను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు లేదని... అది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని అన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.