: 10వ తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 10వ తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ మన్మధరెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 57.32 శాతం బాలికలు ఉత్తీర్ణులవగా, 55.89 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. 75.90 శాతం ఉత్తీర్ణతలో చిత్తూరు జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించగా... 37.99 శాతంతో విశాఖ జిల్లా చివరి స్థానాన్ని ఆక్రమించింది.