: ఎన్నికల కమిషనర్ మిట్టల్ ను కలసిన వైకాపా


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ ను వైకాపా నేతలు కలిశారు. మార్కాపురం జడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఎన్నికను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి రంగారెడ్డిని ఎన్నికల్లో పాల్గొనేలా చేయాలని కోరారు. అంతవరకు ఎన్నికను వాయిదా వేయాలని ఈ సందర్భంగా మిట్టల్ ను కోరారు. అలాగే ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికను కూడా వాయిదా వేయాలని కోరారు. మిట్టల్ ను కలసిన వారిలో మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ ఉన్నారు.

  • Loading...

More Telugu News