: పోలవరంను మేం అడ్డుకోవడం లేదు: ఎంపీ గుత్తా
పోలవరం ప్రాజెక్టును తాము అడ్డుకోవడం లేదని... ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అయితే, వీలైనంత వరకు ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని తాము కోరుతున్నామని చెప్పారు. గిరిజనులను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ లో కలపడం దారుణమని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.