: కోడెల అనుచరులే నాపై దాడి చేశారు... ప్రజాస్వామ్యం బతికే ఉందా?: అంబటి


ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎమ్మెల్యే ముస్తఫాతో కలసి వెళుతున్న తనపై స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుచరులే దాడి చేశారని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వైకాపా తరపున ఏడుమంది ఎంపీటీసీలు గెలుపొందగా, టీడీపీకి ఐదుగురు సభ్యులున్నారని... దీంతో, ఇన్ని రోజుల పాటు ఈ ఏడు మందిని తనతో పాటే, తన నివాసంలో పెట్టుకున్నానని చెప్పారు. ఈ రోజు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో, వీరిని తీసుకుని ముప్పాళ్ల వెళుతుండగా... రెండు, మూడు వాహనాలలో వచ్చిన కోడెల అనుచరులు తమపై దాడి చేశారని... తమ పార్టీకి చెందిన ఏడు మందినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. సాక్షాత్తూ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఇలాంటి అరాచకాలకు పాల్పడితే... ప్రజాస్వామ్యం బతికే ఉందా? అనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బతికుందా? చచ్చిపోయిందా? అని అంబటి ప్రశ్నించారు. దాదాపు 20 నుంచి 25 మంది తమపై దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News