: నగర శివార్లలో రేవ్ పార్టీ... ఆశ్లీల నృత్యాలు చేస్తున్న 12 మంది యువతుల అరెస్ట్
హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీలు పెచ్చుమీరుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు... బడాబాబుల పుత్రరత్నాలు నగర శివార్లలో వాలిపోతున్నారు. రాత్రంతా మజానే మజా. ఈ నేపథ్యంలో, గత రాత్రి నగర శివార్లలోని శామీర్ పేటలో ఉన్న ఓ రిసార్ట్ పై ఎస్ వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఆశ్లీల నృత్యాలు చేస్తున్న 12 మంది యువతులతో పాటు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారంతా బడాబాబుల కుమారులే అని తెలుస్తోంది. అయితే, అరెస్ట్ అయిన వారిని మాత్రం పోలీసులు ఇంతవరకు మీడియాకు చూపించలేదు. అరెస్ట్ అయిన వారిని వదిలేయాలని హై లెవెల్ నుంచి పోలీసులకు ఫోన్లు వస్తున్నట్టు సమాచారం. నృత్యాలు చేయడానికి వచ్చిన అమ్మాయిల్లో కొంత మంది బెంగళూరు నుంచి వచ్చారు. వీరిని ఓ బ్రోకర్ హైదరాబాద్ రప్పించాడని తెలుస్తోంది.