: టీవీ ఆర్టిస్టుల దీక్ష భగ్నం
కొన్ని చానళ్ళు డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం నిలిపివేసే వరకు ఉద్యమం ఆగదంటూ టీవీ ఆర్టిస్టులు చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న బుల్లితెర నటుడు విజయ్ ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తెలుగు టీవీ పరిరక్షణ సమితి నేతలు, సభ్యులు స్పందించారు. న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సబబు కాదని వారు అంటున్నారు. కాగా, జేఏసీ నాయకుడు విజయ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఇతర జేఏసీ సభ్యులు మాట్లాడుతూ, ఆసుపత్రిలోనూ తమ దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.