: కారు పెట్రోల్ బంక్ ను లాగేసింది...భారీ ప్రమాదం
ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో ఓ పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోలు నింపుకున్న ఓ డ్రైవరు పొరపాటుగా పెట్రోల్ పోసే పైప్ కారు ట్యాంకులో ఉండగానే కారును పోనిచ్చాడు. దీంతో పెట్రోల్ పోసే మెషీన్ కూడా ఊడి వచ్చేసింది. దాంతో పెట్రోల్ ఆ ప్రదేశమంతా విరజిమ్మింది. ఉన్నట్టుండి పెట్రోల్ బంక్ భగ్గుమంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రమాదం నుంచి తప్పించుకోగా, ఓ ఉద్యోగి గాయపడ్డాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో పెట్రోల్ ఉండే ట్యాంకుకు మంటలు వ్యాపించకుండా నిలువరించగలిగారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు పెట్రోల్ బంకులోని సీసీ కెమేరా పుటేజ్ ఆధారంగా కారు యజమానిని వెతుకుతున్నారు.