: తిరుమలకు పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ వెలుపలకు సుమారు 3 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ అధికారులు నిలిపివేశారు.