: అలియాతో నటిస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది: వరుణ్ ధావన్
బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ సహనటి అలియా భట్ పై ప్రశంసలు కురిపించాడు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగేట్రం చేసిన వీరిద్దరూ కలిసి మరోసారి 'హంప్టీ శర్మకీ దుల్హన్' సినిమాతో అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో వరుణ్ మాట్లాడుతూ, అలియాతో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని అన్నాడు. ఆమెతో నటిస్తుంటే ఏదో తెలియని ఉత్సాహం తనలో ఉరకలు వేసేదని చెప్పాడు. తమ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు అత్యంత నిదానంగా చెప్పేవాడినని వరుణ్ అన్నాడు. అదే సినిమాకు ప్లస్ అయిందని, తనకు ప్రేక్షకులను అలరించడమే ప్రధానమని వరుణ్ ధావన్ స్పష్టం చేశాడు.