: చెన్నై స్టేట్ బ్యాంక్ లో ఎగసిపడుతున్న మంటలు
చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఘటనా స్థలికి 4 ఫైరింజన్లు చేరుకున్నాయి.